కృష్ణపట్నం పోర్టులో మనకు మిగిలింది బొగ్గు, బూడిదే- కంటైనర్ టెర్మినల్ మూసివేతపై అఖిలపక్షం ఆందోళన - Somireddy Chandramohan Reddy
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 7, 2024, 5:31 PM IST
Round Table Meeting in Nellore: కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ మూసివేతకు వ్యతిరేకంగా నెల్లూరులో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కంటైనర్ టెర్మినల్ ఆధారిత ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష నేతలు పాల్గొన్నారు. గత నెల 31వ తేదీ నుంచి కంటైనర్ల రవాణాకు పోర్టు యాజమాన్యం అనుమతివ్వడం లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కంటైనర్ టెర్మినల్‌ను తమిళనాడుకు తరలిస్తూ కృష్ణపట్నంలో మాత్రం బొగ్గు, బూడిద రవాణాకే పరిమితం చేయడం దారుణమన్నారు. కంటైనర్ టెర్మినల్ మూతపడితే మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉండనని చెప్పిన మంత్రి కాకాణి ఇప్పడేం సమాధానం చెబుతారని నిలదీశారు. పోర్టు సీఈవో కూడా మంత్రి చెప్పారని అబద్ధాలు చెప్పడం దారుణమన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో పోర్టుకు వెళ్లి సీఈఓను కలుస్తామని తెలిపారు.
"గత నెల 31వ తేదీ నుంచి కంటైనర్ల రవాణాకు పోర్టు యాజమాన్యం అనుమతివ్వడం లేదు. కంటైనర్ టెర్మినల్‌ను తమిళనాడుకు తరలిస్తూ కృష్ణపట్నంలో మాత్రం బొగ్గు, బూడిద రవాణాకే పరిమితం చేయడం దారుణం. కంటైనర్ టెర్మినల్ మూతపడితే మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉండనని చెప్పిన మంత్రి కాకాణి ఇప్పడేం సమాధానం చెబుతారు?" - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి