ఆగిన లారీని ఢీకొట్టిన బస్సు- పది మందికి తీవ్ర గాయాలు - aprtc Bus Hit Lorry 10 injured - APRTC BUS HIT LORRY 10 INJURED
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 19, 2024, 2:51 PM IST
Road Accident In Srikakulam District : శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం జాతీయ రహదారి అదపాక కూడలి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం రహదారిపై మరమ్మతులకు గురై ఆగి ఉన్న లారీని విశాఖ డిపోకు చెందిన నాన్ స్టాప్ ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరావు, లారీ క్లీనర్ గౌతమ్ తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు బస్సులో ఉన్న మరో 8 మంది ప్రయాణికులు స్వలంగా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ఎచ్చెర్ల, లావేరు ఎస్సైలు చిరంజీవి, స్వామినాయుడు, స్థానిక యువకులు సహాయంతో క్షతగాత్రులను బయటకు తీసి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం హాస్పిటల్కి తరలించారు.