అప్పుల బాధతో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య - Real Estate Trader Suicide
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 20, 2024, 8:56 PM IST
Real Estate Trader Commits Suicide Due to Debt in Anantapur District : అప్పుల బాధ భరించలేక అనంతపురంలో పెద్దన్న అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో కలకలం రేపింది. నగరంలోని నాలుగో రోడ్డులో నివాసం ఉంటున్న పెద్దన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించేేవాడు. గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సరిగ్గా లేకపోగా ఆర్థిక కష్టాలు ఎక్కువయ్యాయి. దీంతో అప్పుల బాధ భరించలేక టవర్‌క్లాక్ వద్ద ఉన్న తన కార్యాలయంలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శనివారం ఉదయం ఎప్పటిలాగే తన కార్యాలయానికి వెళ్తున్నానని కుటుంబసభ్యులతో చెప్పి పెద్దన్న బయటకు వచ్చారు. చేసిన అప్పులు, దెబ్బతిన్న వ్యాపారంతో మనస్తాపానికి గురైన వ్యాపారి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బోరున విలపించారు. మృతుడు పెద్దన్నకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు.