రేషన్ పంపిణీకి వాలంటీర్ల దూరం - కలెక్టర్లుకు ఆదేశాలు జారీ చేసిన పౌరసరఫరా శాఖ కమిషనర్ - Ration Rice Distribution - RATION RICE DISTRIBUTION
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 2, 2024, 11:34 AM IST
Ration Rice Distribution No Volunteers Services in Vijayawada : రేషన్ పంపిణీలోనూ వాలంటీర్లు పాల్గొనకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ పౌరసరఫరాల శాఖ కమిషనర్ (Civil Supplies Department) అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామవార్డు సచివాలయ శాఖను ఆదేశించారు. ఈ నెల చౌక బియ్యం పంపిణీలోనూ పాల్గొనకుండా చూడాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం చౌక బియ్యం పంపిణీ కార్యక్రమాలకు వాలంటీర్ల హాజరు కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. ఇందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సూచనలు జారీ చేశారు.
Civil Supplies Department Issued Order : చౌక బియ్యం పంపిణీలో ప్రభుత్వ ఉద్యోగుల సేవల్ని వినియోగించుకునేలా చర్యలు చేపట్టాల్సిందిగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ గ్రామ వార్డు సచివాలయ శాఖకు సూచనలు ఇచ్చారు. మరోవైపు ఈపోస్ యంత్రాల్లోనూ వాలంటీర్ల ధృవీకరణను తొలగించాల్సిందిగా ప్రభుత్వం సూచనలు ఇచ్చింది. లబ్దిదారుల వేలి ముద్రలు పడని కేసుల్లో ఐరిస్ ధృవీకరణ కోసం వాలంటీర్లకు బదులుగా వీఆర్వో మ్యాపింగ్ ను వినియోగించుకోవాల్సిందిగా స్పష్టం చేశారు.