ఏపీలో కాంగ్రెస్ ఉనికి లేదు - షర్మిల సోనియా పెంపుడు కూతురు : రాచమల్లు - షర్మిషలపై రాచమల్లు కామెంట్స్
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 22, 2024, 7:06 PM IST
Rachamallu Shivaprasad Reddy Comments on YS Sharmila : వైఎస్ షర్మిలను సోనియా గాంధీ పెంపుడు కుమార్తెగా చూస్తాం, రాజశేఖర్‌రెడ్డి బిడ్డగా చూడదలుచుకోలేదని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వాఖ్యానించారు. సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ ఆడుతున్న రాజకీయ నాటకంలో షర్మిల కీలుబొమ్మ అయ్యిందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే షర్మిల వైఎస్సార్సీపీ పాలన పై విమర్శలు చేశారని రాచమల్లు అన్నారు. రాష్ట్రంలో దీపం పెట్టి చూసినా అభివృద్ధి కనబడటం లేదన్న షర్మిల మాటల్లో వాస్తవం లేదన్నారు.
రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్‌కు ఏపీలో ఉనికి లేదన్నారు. తెలంగాణలో రాజకీయ జీవితాన్ని కోల్పోయిన షర్మిల ఏపీలో ఆనవాళ్లు కూడా లేని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత షర్మిలకు లేదని వ్యాఖ్యానించారు. ఎవరో ఆడిస్తే ఆడటానికే తప్ప స్వయంగా షర్మిల ఏపీకి రాలేదని, సోనియా గాంధీ పంచన చేరిన తను రాష్ట్రంలో ఏ మాత్రం ఆదరణ పొందలేదని రాచమల్లు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిపై విమర్శలు చేశారు.