ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదిన సత్తా చాటిన తెలంగాణ మహిళ - ఫిన్ స్విమ్మర్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం - Tg Women Cross English Channel - TG WOMEN CROSS ENGLISH CHANNEL
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 8, 2024, 5:38 PM IST
Telangana Women Cross English Channel : ప్రపంచవ్యాప్తంగా స్విమ్ ఎవరెస్ట్‌గా పిలుచుకునే ఇంగ్లీష్ ఛానల్‌ను ఈది తెలంగాణ బిడ్డ సత్తా చాటింది. ఈ రికార్డు సాధించిన తొలి తెలుగు మహిళగా గంధం క్వీన్ విక్టోరియా నిలిచారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లుకు చెందిన క్వీన్ విక్టోరియా హైదరాబాద్‌లోని బర్కత్‌పురాలో నివసిస్తూ ఫిన్ స్విమ్మర్‌గా రాణిస్తున్నారు. ఇప్పటికే పలు బంగారు, రజిత, కాంస్య పతకాలు సాధించిన విక్టోరియా 44 ఏళ్ల వయసులో ఇంగ్లీష్ ఛానల్ ఈది రికార్డు నెలకొల్పారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న అట్లాంటిక్ మహా సముద్రాన్ని ఇంగ్లీష్ ఛానల్‌గా పిలుస్తారు.
విక్టోరియా శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకోవడంతో ట్రైనర్లు, కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఇంగ్లీష్ ఛానెల్‌ను ఈదడం సంతోషంగా ఉందని విక్టోరియా తెలిపారు. 16డిగ్రీల సెల్సియస్ చల్లటి నీటిలో ప్రయాణాన్ని మొదలు పెట్టినప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని తెలిపారు. ఈ విజయాన్ని తెలుగు ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ఆమె వివరించారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరెన్నో పథకాలు తీసుకొస్తానని విక్టోరియా వెల్లడించారు.