మంత్రి ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్థులు - అసహనంతో వెనుదిరిగిన రోజా - Protest to YSRCP Leader Roja - PROTEST TO YSRCP LEADER ROJA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 4, 2024, 9:22 AM IST
Protest to YSRCP Leader Roja From VemaPuram Villagers : నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోజాకు నిరసన సెగ తగిలింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తిరుపతి జిల్లా వడమాల పేట మండలం పరిధిలోని పూడి పంచాయతీ వేమాపురం గ్రామంలో వైఎస్సార్సీపీ ప్రచార రథాన్ని గ్రామస్ధులు అడ్డుకున్నారు. వేమాపురం గ్రామంలో మంత్రి రోజా ప్రచారం నిర్వహించడానికి ప్రచారం రథంలో వచ్చారు. ఓట్లు అభ్యర్థిస్తుండగా గ్రామస్థులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ గ్రామానికి ఏం మేలు చేశారని ఓట్లు అడగడానికి ఇక్కడకు వచ్చారని ప్రశ్నించారు.
Rk Roja Election Compain In Nagari : ఈ నేపథ్యంలో గ్రామస్థులు, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. గ్రామంలో ప్రచార రథం తిరగకుండా అడ్డుకున్నారు. పోలీసులు అక్కడకు వచ్చి నచ్చజెప్పినా వారు వినలేదు. పోలీసులు సహాయంతో గ్రామంలో ప్రచార రథం పైకెక్కి ఓట్లని అభ్యర్థించే ప్రయత్నం చేసింది. ఆమె ప్రచార రథం ఎక్కడంతో గ్రామస్థులు ఇళ్లకు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రోజా అసహనానికి లోనైంది. ఆపై ఆమె పది నిమిషాల పాటు అక్కడే ఉండి వెనుదిరిగారు.