రోడ్డు లేని కారణంగా నిలిచిన అంబులెన్స్ - మధ్యలోనే గర్భిణీ ప్రసవం - WOMAN DELIVERY ON ROAD - WOMAN DELIVERY ON ROAD
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 8, 2024, 3:09 PM IST
Pregnant Woman Delivery on the Road in Alluri District : నిండు గర్భిణిని చేతులతో మోసుకెళ్తుండగా మార్గం మధ్యలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన అల్లూరి జిల్లా అనంతగిరి మండలం చీడివలస కొండ శిఖర గ్రామంలో జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు పురిటి నొప్పులు రావడంతో 108 ఫోన్ చేయగా ఉదయం 8 గంటలకు అంబులెన్స్ వచ్చి రోడ్డు లేని కారణంగా గ్రామానికి కిలోమీటర్ దూరాన ఆగింది. దీంతో గర్భిణీ కిల్లో వసంత మూడో కాన్పు కోసం అంబులెన్స్ వద్దకు తీసుకెళ్లే క్రమంలో మార్గ మధ్యలో ఆడబిడ్డ జన్మించింది.
అధిక రక్తస్రావం జరగడంతో 108 సిబ్బంది కొంత వైద్య సహాయం చేసి అంబులెన్స్‌లో హుకుంపేట మండలం ఉప్ప ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. ఉపాధి పథకం ద్వారా మిషన్ కనెక్ట్ కార్యక్రమంలో కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టినట్టు రికార్డు చూపిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఆ పథకం ద్వారా మంజూరైన రోడ్డును పొక్లెయిన్‌తో పని చేసి మధ్యలోనే వదిలేశారు. పెండింగ్ నిధులు మంజూరు చేసినా తిరిగి పనులు ప్రారంభించలేదని గ్రామస్థులు మండిపడ్డారు. తక్షణమే రోడ్డుని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.