నాణ్యత లోపం - నెల రోజులు కాకముందే రహదారి గోతుల మయం

🎬 Watch Now: Feature Video

thumbnail

Poor Quality of Road Construction : అనకాపల్లి జిల్లాలోని శంకరం వద్ద ఉన్న బొజ్జన్న కొండకు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. ఎంపీ ల్యాడ్స్ నిధులతో (MP Lads Funds) నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ పనులకు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి 40 లక్షల రూపాయలు వెచ్చించారు. గత నెల 23న మంత్రి అమరనాథ్, ఎంపీ సత్యవతి రహదారిని ప్రారంభించారు. రోడ్డు ప్రారంభించి నెల రోజులు గడవక ముందే పలు చోట్ల గోతులు ఏర్పడ్డాయని స్థానిక ప్రజలు ఆరోపించారు. గుత్తేదారుడు చేపట్టిన నాణ్యత లోపం పనులతో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. 40 లక్షల రూపాయలు దుర్వినియోగం అయ్యిందని, గుత్తేదారుడిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుత్తేదారుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ : ప్రారంభించి నెల రోజులు గడవక ముందే పలు చోట్ల సీసీ రోడ్డు రూపురేఖలు మారడం విమర్శలకు దారి తీస్తోంది. రహదారి నిర్మాణ పనుల నాణ్యతపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. త్వరగా ప్రతిష్టమైన రహదారిని నిర్మించాలాలని స్థానికులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.