'ఆశా వర్కర్ల ఛలో విజయవాడ' అడ్డుకున్న పోలీసులు - పలువురి అరెస్టు
🎬 Watch Now: Feature Video
Police Was Arrested By Asha Workers: డిమాండ్ల సాధన కోసం ఛలో విజయవాడకు బయలుదేరిన ఆశా కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్భంధించారు. ముందస్తు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఛలో విజయవాడకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా అనకాపల్లి నుంచి విజయవాడకు బయలుదేరిన ఆశా వర్కర్లను అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముమ్మిడివరం కాట్రేనికోన మండలం నుంచి బయలుదేరిన ఆశ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
ఛలో విజయవాడకు బయలుదేరిన అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఆశా కార్యకర్తలను పోలీసులు ఊబలంక పీహెచ్సీ వద్ద సమావేశం ఉందని చెప్పి వారిని గోపాలపురం వద్ద కళ్యాణ మండపంలో నిర్భంధించారు. అంబాజీపేటలో ఆశా వర్కర్లను అడ్డుకోవడంతో జనసేన, తెలుగుదేశం నేతలు ఆందోళన చేపట్టారు. సమస్యల పరిష్కారం కోసం విజయవాడ బయలుదేరిన 60 మంది ఆశా కార్యకర్తలను నంద్యాల రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని మూడో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆశా వర్కర్లు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.