కృష్ణా జిల్లాలో భారీ మద్యం డంప్‌ స్వాధీనం- సోదాల్లో 58,080 మద్యం సీసాలు లభ్యం - LIQUOR DUMP IN Krishna district - LIQUOR DUMP IN KRISHNA DISTRICT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 28, 2024, 10:44 PM IST

Updated : Apr 28, 2024, 10:51 PM IST

Police seized huge liquor dump in Krishna district : ఎన్నికల వేళ కృష్ణా జిల్లాలో ఓ భారీ మద్యం డంప్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని గన్నవరం మండలం మెట్లపల్లిలో ఈ డంప్ బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మెట్లపల్లి గ్రామంలోని స్థానిక మామిడి తోటలో భారీగా మద్యం నిల్వలు ఉన్నట్లు పోలీసులు సమాచారం వచ్చింది. వెంటనే బలగాలతో ఆ ప్రాంతానికి చేరుకొని తనిఖీలు నిర్వహించాం. ఈ సోదాల్లో దాదాపుగా 58,080 క్వాటర్ బాటిళ్లు లభించాయి. ఈ మద్యం మెుత్తన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించాం. దీని విలువ సుమారు రూ. 75 లక్షలు ఉంటుంది. 

ఈ మద్యం ఎన్నికల సమయం కాబట్టి ఓటర్లకు పంపీణీ చేసేందుకు గోవా నుంచి దిగుమతి చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్థరణ అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని గూడపాటి దుర్గాప్రసాద్ అనే వ్యక్తితోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాము. అలాగే ఈ భారీ మద్యం నిల్వ వెనుక ఎవరు ఉన్నారనే దానిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాము. మద్యం పట్టుబడిన తోటలో గత కొంతకాలంగా వైసీపీ అభ్యర్థి వంశీ అనుచరులు పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉందని పోలీసులు తెలిపారు.

Last Updated : Apr 28, 2024, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.