మద్యం సీసాలు ధ్వంసం చేస్తుండగా చెలరేగిన మంటలు - police destruction illegal liquor - POLICE DESTRUCTION ILLEGAL LIQUOR
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 1, 2024, 10:30 PM IST
Police Destruction to Illegal Liquor in Krishna District : కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల తనిఖీల్లో భాగంగా పట్టుబడిన మద్యం సీసాలను స్థానిక సర్వీస్ రోడ్డులో పోలీసులు ధ్వంసం చేశారు. అయితే ఎటువంటి ముందస్తు అగ్నిప్రమాద చర్యలు చేపట్టక పోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మద్యం ధ్వంసం చేయటాన్ని పోలీసులు నిలిపివేశారు. వాహనాలు ప్రయాణించే రోడ్లపై ఈ హడావుడేంటని పోలీసుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఎన్నికల సమయంలో ఓటర్లకు పంపీణీ చేయటం కోసం గన్నవరం మండలం మెట్లపల్లిలో భారీగా నిల్వ ఉంచిన గోవా మద్యాన్ని కొద్ది రోజుల కిందట పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. అక్కడి మామిడి తోటలో అక్రమంగా నిలువ చేసి ఉంచిన రూ.80 లక్షల విలువైన 58,032 మద్యం బాటిల్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. మద్యం పట్టివేత కేసులో మామిడి తోట యజమానితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈరోజు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు పోలీసులు ఈ మద్యాన్ని ధ్వంసం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.