వైసీపీ స్టిక్కర్లు అతికించిన కారులో పోలీసులు - వీడియో వైరల్ - వైసీపీ స్టిక్కర్ల కారులో పోలీసులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 5, 2024, 11:58 AM IST
Police Coming TDP Ra Kadali Ra Meeting in YCP Stickers Car: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సభకు పోలీసులు వైసీపీ స్టిక్కర్లు అతికించిన కారులో రావడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించిన 'రా కదలిరా' సభకు మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లు ఉన్న కారులో పోలీసులు వచ్చారు. సభలో వీడియోలు తీస్తూ టీడీపీ కార్యకర్తలను బెదిరించారని టీడీపీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం పెనుకొండలో జరిగిన రా కదలిరా సభ జరిగిన విషయం తెలిసిందే. ఈ సభకు భారీగా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణానికి వచ్చిన పోలీసులు వైఎస్సార్సీపీ స్టిక్కర్లు ఉన్న కారులో వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పోలీసులు అధికార పార్టీ నేతలకు మద్దతుగా ఉంటున్నారని అనడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యమని పలువురు విమర్శిస్తున్నారు. టీడీపీ నేతలపై పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు.