బుచ్చిపేటరేవులో ఇసుక అక్రమ రవాణా ముఠా అరెస్ట్‌- 14 లారీలు సీజ్​ - ILLEGAL SAND TRANSPORT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 13, 2024, 3:15 PM IST

thumbnail
బుచ్చిపేట రేవులో ఇసుక అక్రమ రవాణా ముఠా అరెస్ట్‌- 14 లారీలు సీజ్​ (ETV Bharat)

Police Arrested in Illegal Sand Transport Gang: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం బుచ్చిపేట ఇసుక రేవులో అక్రమంగా ఇసుక తరలింపుకు సిద్ధంగా ఉంచిన 14 లారీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారు జామున జిల్లా యంత్రాంగం ఈ దాడులు నిర్వహించి లారీలను నరసన్నపేట పోలీస్ స్టేషన్​కు తరలించారు. వంశధార నదిలో ఉన్న ఇసుకను విశాఖపట్నం అక్రమంగా తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో దాడులు చేసి లారీలను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

కాగా వంశధార నదిలోని ఇసుకను లారీల ద్వారా అక్రమంగా తరలించి లక్షలాది రూపాయలు ప్రభుత్వ సొత్తును కొల్లగొడుతున్నారని పోలీసులు తెలిపారు. ఇసుక రేవులో నుంచి అక్రమ ఇసుక రవాణా ముఠాను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఇసుక తవ్వకాలను నిలిపివేయగా అవేవి తమకు పట్టవన్నట్టు కొందరు రాత్రి సమయాల్లో అక్రమంగా లారీల్లో ఇసుక తరలింపులు చేస్తున్నారు. ఎవరికీ తెలియకుండా అక్రమంగా ఇసుకను తరలించి ఇసుకాసురులు సొమ్ము చేసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.