150 కిలోల గంజాయి సీజ్- నలుగురు అరెస్ట్ - గంజాయి తరలిస్తూ నలుగురు అరెస్ట్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 22, 2024, 3:50 PM IST
Police Arrest Illegal Ganja Transporters in alluri District : అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కారు, ద్విచక్రవాహనం సహా 150 కిలోల గంజాయిని అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ రుద్రశేఖర్, ఎస్ఐ సంతోష్‌లు అందించిన వివరాల మేరకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు అరకులోయ మండలానికి చెందిన ఇద్దరు యువకులు లారీలో గంజాయిని తరలించేందుకు ప్రయత్నిస్తుండగా వాహనాల తనిఖీ సమయంలో వారు పోలీసులకు చిక్కారు.
police Seized 150 Kgs Ganja : ఈ ఘటనలో లారీలో, గంజాయి పాటు నలుగురు వ్యక్తులను గంజాయికి పైలట్లుగా వెళుతున్న కారు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఒడిస్సాలోని ఓ ప్రాంతంలో గంజాయిని కొనుగోలు చేసి ఉత్తరప్రదేశ్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో సంబంధం ఉన్న మరి కొంతమంది వ్యక్తుల కోసం విచారణను ముమ్మరం చేసామన్నరు.