అమ్మ పెట్టదు- అడుక్కోనివ్వదు! తాగునీటి సమస్య తీర్చరు-పరిష్కరించేవారిని అడ్డుకుంటారు! - People Fire on YSRC in Ananatapur
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 9, 2024, 6:04 PM IST
People Fire on YSRCP Leaders In Ananatapur District : అమ్మా పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్లుగా వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు వ్యవహరిస్తున్నారని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని ఎర్రనేల వీధిలో తీవ్ర తాగునీటి సమస్యతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే (MLA) అభ్యర్థి సురేంద్రబాబు ప్రచారం చేసే సమయంలో కాలనీలో తాగునీటి (Drinking Water) సమస్యను స్థానికులు ఆయనకు తెలియజేశారు. దీంతో ఆయన సొంత ఖర్చులతో కాలనీలో బోరు వేయించే ఏర్పాట్లు చేశారు. బోరు వేయించడానికి వాహనం సైతం తెప్పించారు.
స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులను పంపి ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకపోగా సాయం చేసేవారిని కూడా వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకుంటున్నారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం బోరు వేయడానికి వస్తే అడ్డుకోవడం ఏంటని పోలీసులను స్థానికులు ప్రశ్నించారు. బోర్ వేయడానికి అనుమతి లేదని పోలీసులు చెప్పటంతో పోలీసు (Police) లకు దీనికి సంబంధం ఏంటి అని ప్రజలు ప్రశ్నించారు.