సమ్ థింగ్ స్పెషల్ - సతీమణితో పవన్‌కల్యాణ్ సెల్ఫీ - Pawan Wife Received Masters Degree - PAWAN WIFE RECEIVED MASTERS DEGREE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 20, 2024, 10:33 PM IST
Pawan Kalyan Wife Received her Masters Degree: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకున్నారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో అన్నా లెజ్నేవా పట్టా స్వీకరించారు. ఆగ్నేయాసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానంలో మాస్టర్స్ చేశారు. ఇప్పటి వరకు అన్నా రెండు మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేశారు. మాస్టర్స్ పట్టా తీసుకున్న సందర్భంగా పవన్ కల్యాణ్ తన సతీమణి అన్నా లెజ్నేవాను అభినందించారు. తనతో కలసి స్వీయ చిత్రం దిగారు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలోని ఓరియంటల్ స్టడీస్‌లో హానర్స్ పట్టా పొందారు. ఆసియా దేశాల చరిత్ర, భాషలు, జీవన విధానంపై డిగ్రీ సాధించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో ఉండగానే మూడు భాషలు కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత బ్యాంకాక్‌లోని చులాలాంగ్ కార్న్ యూనివర్సిటీ నుంచి థాయ్ స్టడీస్‌లో అన్నా మొదటి మాస్టర్స్ డిగ్రీ సాధించారు.