Live: పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు - ప్రత్యక్ష ప్రసారం - Ugadi Celebrations Live - UGADI CELEBRATIONS LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-04-2024/640-480-21180487-thumbnail-16x9-pawan.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 10:55 AM IST
|Updated : Apr 9, 2024, 11:18 AM IST
Pawan Kalyan participated in Ugadi celebrations: తెలుగు రాష్ట్రాల ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో సంతోషాలు, ఐశ్వర్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమై, సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో పవన్‌క ల్యాణ్ మంగళవారం ఉగాది వేడుకల్లో పాల్లొంటారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీచేస్తున్న పవన్‌కల్యాణ్ గొల్లప్రోలు బైపాస్‌లో నూతన భవనంలో నివాసం ఉండబోతున్నారు. ఇక్కడే పూజలు నిర్వహించి, ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొంటారు. వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకుంటారు. ఈ భవనంలోని కింది అంతస్తును సమావేశ మందిరంగా మార్చి పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. మంగళవారం ఉదయం గొల్లప్రోలు చేరుకొనున్న పవన్ , ఉగాది వేడుకల అనంతరం పార్టీ కీలక నాయకులతో పవన్ సమావేశమవుతారు. సాయంత్రం హైదరాబాద్ వెళ్తారు.
Last Updated : Apr 9, 2024, 11:18 AM IST