జగన్ అభిమానులు Vs పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ - యాత్ర-2 సినిమా ప్రదర్శనలో ఉద్రిక్తత - Tensions at Yatra 2 movie screening
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 8, 2024, 9:57 PM IST
Pawan Jagan Fans Clash at Yatra 2 Screening: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులే కాదు, ఆయా పార్టీల కార్యకర్తలు కూడా తగ్గేదే లే అంటున్నారు. తమ అభిమాన నేతలపై ఎవరైనా కామెంట్ చేసినా, చులకనగా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులతో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఈ పిచ్చి సినిమా థియేటర్లకు సైతం పాకింది. హైదరాబాద్ ఐమాక్స్‌లో సీఎం జగన్ అభిమానులు వర్సెస్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులుగా మారిపోయింది. తమ నేత గొప్పవాడు అంటే తమ నేత గొప్పవాడు అంటూ మెుదలైన అరుపులు దాడులు చేసుకునే వరకూ వెళ్లింది.
హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్‌లో సీఎం జగన్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. యాత్ర-2 సినిమా ప్రదర్శనలో ఇద్దరి అభిమానులు జై జగన్, జై పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. మా నేత గొప్ప అంటే మా నేత గొప్ప అంటూ ఇరు వర్గాలు బాహాబాహికి దిగాయి. ఇరువురి అభిమానుల అల్లర్లతో ఐమ్యాక్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఐమ్యాక్స్‌కు చేరుకున్నారు. అల్లరి చేస్తున్న వారిని చెదరగొట్టారు. అనంతరం పోలీసుల భద్రత మధ్య సినిమా ప్రదర్శనను కొనసాగించారు.