ఏలూరులో విషాదం - ఆస్పత్రి భవనం పైనుంచి దూకి రోగి మృతి - Patient Suicide in Hospital - PATIENT SUICIDE IN HOSPITAL
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 2, 2024, 9:15 PM IST
Patient Suicide in Hospital: ఆపరేషన్ చేయించుకోవడానికి భయపడి ఆస్పత్రి భవనం నుంచే దూకి రోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం గుడిపాడుకు చెందిన సత్యనారాయణ ఉదర సంబంధిత వ్యాధితో ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రెండు రోజులుగా చికిత్స పొందుతున్నాడు. శస్త్రచికిత్స చేయాలని భావించిన వైద్యులు, ఆపరేషన్‌కు సిద్ధం చేస్తుండగా సత్యనారాయణ భయపడి ఆస్పత్రి భవనం మూడో అంతస్తులోని బాత్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. కిటికీలోంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.
అయితే రోగి ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తాము వచ్చే వరకు ఆగకుండా మృతదేహాన్ని తరలించడంపై మృతుని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో నేలపై పడుకొని బంధువులు నిరసన వ్యక్తం చేశారు. ఆస్పత్రి యాజమాన్య నిర్లక్ష్యమే ఆత్మహత్యకు కారణమని బందువులు ఆరోపించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు రావాలని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.