ఉదయం తొమ్మిదైనా వీడని పొగమంచు- వాహనదారుల పాట్లు - పొగమంచుతో వాహనదారుల ఇబ్బందులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 1:03 PM IST
Passengers Suffering With Snow in NTR District : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై దట్టంగా అలముకున్న మంచుతో దారి కనిపించక లైట్లు వేసుకొని చోదకులు వాహనాలు నడుపుతున్నారు. ద్విచక్ర వాహనదారులు సైతం మంచులో వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు నెమ్మదిగా వారి ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఉదయం తొమ్మిది గంటలవుతున్నా మంచు వీడక పోవడంతో తెల్లవారు జామున పనులు అంటే భయంగా ఉందని వాహనదారులు వాపోతున్నారు.
Huge Dense Fog On Hyderabad-Vijayawada Highway : మంచు ఎక్కువగా కురవడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు, జనం కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు తెలుపుతున్నారు. జాతీయ రహదారిపై కూడా చాలా నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని తెలుపుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర రహదారుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీనివల్ల ప్రమాదాలు జరుగుతాయని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.