ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ దౌర్జన్యం- నీటి సమస్య పరిష్కారమే మా తొలి ప్రాధాన్యం : పరిటాల సునీత - sunitha fire on mla Prakash Reddy - SUNITHA FIRE ON MLA PRAKASH REDDY

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2024, 4:51 PM IST

Paritala Sunitha Fire on YCP MLA Thopudurthi Prakash Reddy : ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల సునీత విమర్శించారు. ఐదేళ్లల్లో ఎమ్మెల్యే తోపుదుర్తి బ్రదర్స్‌ శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అరాచకారలతో ప్రజలు ఎదురుతిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఈ ఐదేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న తాగునీటి సమస్యను తీర్చడమే తొలి ప్రాధాన్యతని స్పష్టం చేశారు.

అలాగే నియోజవర్గంలోని ఏగ్రామానికి వెళ్లిన ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. ఎక్కడ చూసినా తాగునీటి సమస్య పట్టి పీడిస్తుందన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో విసుగు చెందిన ప్రజలు టీడీపీలోకి భారీగా చేరుతున్నారని తెలిపారు. టీడీపీ హయాంలో ఇక్కడికి వచ్చిన జాకీ పరిశ్రమను వైసీపీ నాయకులు దాదాపుగా రూ.15కోట్లు డిమాండ్ చేయడంతో వారు వెళ్లిపోయారని, సుమారు 6వేల మందికి ఉపాధి అవకాశాలను దూరం చేశారని మండిపడ్డారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అలాంటి పరిశ్రమలను నియోజకవర్గానికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని పరిటాల సునీత స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.