పంచాయతీలకు నిధులు ఇవ్వాలని సీఈవోకు ఫిర్యాదు : పంచాయతీరాజ్ ఛాంబర్ - Panchayat Raj Chamber Complaint CEO - PANCHAYAT RAJ CHAMBER COMPLAINT CEO
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 16, 2024, 9:40 AM IST
Panchayat Raj Chamber Representatives Complaint to CEO: కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేసిన 15 ఆర్థిక సంఘం నిధులు తక్షణమే ఇచ్చేలా చూడాలని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రతినిధులు సీఈఓకు ఫిర్యాదు చేశారు. వైవీబీ రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రతినిధులు ముఖేష్ కుమార్ మీనాను కలిసి వినతి పత్రాన్ని అందించారు. కేంద్రం విడుదల చేసిన రూ.988 కోట్ల రూపాయలని కాజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలోనూ ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఎగ్గొట్టిందని ప్రతినిధులు ఆరోపించారు. నిధులను విడుదల చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ముకేశ్ కుమార్ మీనాను కోరినట్లు వైవీబీ తెలిపారు.
2023-24 సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం రాష్ట్రానికి రూ.988 కోట్ల ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసి మూడు వారాలైనా ఇప్పటికీ పంచాయతీల ఖాతాలలో ఆ డబ్బు జమకాలేదు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వీటిని కూడా మళ్లించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.3.50 కోట్ల గ్రామీణ ప్రజలకు వేసవిలో తాగునీరు అందించాలంటే పంచాయతీల దగ్గర నిధులు లేవు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో డబ్బును జమ చేయాలి అని రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.