ఈటీవీ, ఈటీవీ భారత్ కథనంపై స్పందించిన వైద్యారోగ్యశాఖ, రెవెన్యూ అధికారులు - Officials Responded - OFFICIALS RESPONDED
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 31, 2024, 1:46 PM IST
Officials Responded to Boy Rare Disease in YSR District : వైఎస్సార్ జిల్లా బద్వేలు త్యాగరాజ కాలనీలో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న జనార్దన్ మురుగన్ ఆరోగ్యంపై వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ నెల 23, 25న (మే 23, 25) ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్లో వచ్చిన మానవీయ కథనానికి బద్వేల్ ఆర్డీఓ (RDO) వెంకటరమణ స్పందించారు.
ఐదేళ్లుగా అంతుచిక్కని వ్యాధితో జనార్దన్ మురుగన్ నరకం చూస్తున్నాడని, ప్రభుత్వ సాయం కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారని ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్లో కథనాలు వచ్చాయి. దీంతో బాలుడి ఆరోగ్యంపై ఆరోగ్యశాఖ అధికారులు ఆరా తీశారు. వెంటనే బాలుడి ఆరోగ్య స్థితిగతులపై నివేదిక పంపించాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. వ్యాధిని నయం చేయించడానికి బాలుడి తల్లిదండ్రులు కలవని వైద్యుడు లేరని, ఇప్పుడు అధికారులు స్పందించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్నా సమయంలో వారిని ఈనాడు యాజమాన్యం ఆదుకుందని, వారికి కృతజ్ఞతలు తెలిపారు.