మహనంది ఆలయ భూముల్లో అక్రమ కట్టడాలు - ఇల్లు కూల్చివేసిన అధికారులు - Temple Land Kabja in Nandyal - TEMPLE LAND KABJA IN NANDYAL
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 24, 2024, 6:54 PM IST
Officials Remove Encroachments on Temple Lands : నంద్యాల ఎస్బీఐ కాలనీలో మహనంది ఆలయానికి చెందిన భూమిలోని ఆక్రమణలను అధికారులు తొలగించారు. ఆలయానికి చెందిన 3.78 ఎకరాల భూమిలో 1.70 ఎకరాలు దేవాదాయశాఖ ఆధీనంలో ఉంది. మిగతా రెండు ఎకరాల భూమిని 27 మంది ఆక్రమించుకుని ప్లాట్లు వేశారు. అందులో ఓ వ్యక్తి ఇంటిని నిర్మించుకున్నారు. ఆలయ భూమి ఆక్రమణలపై అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం 14 సెంట్ల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆలయ అధికారులు అక్రమంగా నిర్మించిన ఇంటిని కూల్చి వేశారు. త్వరలో అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు.
ఇటీవల అన్ని జిల్లాల్లో ఆలయాలు, దేవదాయ సంస్థల వారీగా అధికారులు భూముల వివరాలు సేకరించారు. ఆలయాలన్నింటికీ కలిపి రికార్డుల ప్రకారం మొత్తం 4.67 లక్షల ఎకరాల భూములున్నట్లు గుర్తించారు. ఆక్రమణల్లోని దేవదాయ శాఖ భూములను స్వాధీనం చేసుకోబోతున్నామంటూ జగన్ ప్రభుత్వం హడావిడి చేసింది తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.