అనంతపురం జిల్లాలో దారుణం - హాస్టల్ గదిలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య - nursing student suicide
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 13, 2024, 7:37 PM IST
Nursing Student Committed Suicide in Anantapur District : అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వసతి గృహంలోని గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గుంతకల్లు నియోజకవర్గంలోని తిమ్మాపురం గ్రామ సమీపంలో ఉన్న పద్మావతి శ్రీనివాస ఆయుర్వేదిక్ ఆసుపత్రి కళాశాలలో ఈ ఘటన జరిగింది. ఆసుపత్రి సూపరిండెంట్ కమలమ్మ మాట్లాడుతూ.. మృతురాలు కీర్తి(21)తో పాటు నలుగురు స్నేహితులు వసతి గృహంలో ఒకే గదిలో ఉంటున్నారని తెలిపారు. ఈరోజు మిగతా స్నేహితులు క్లాసులకు వెెళ్లగా, కీర్తీ ఒక్కటే హాస్టల్లోనే ఉందని, క్లాసులు పూర్తయిన తర్వాత స్నేహితులు కీర్తికి ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదని తెలిపారు. దీంతో హాస్టల్ దగ్గరికి వెళ్లి తలుపు తట్టగా ఎటువంటి సమాధానం రాలేదని, కంగారు పడ్డ స్నేహితులు కళాశాల సిబ్బందికి సమాచారం అందించారని అన్నారు.
చివరికి విద్యార్థులు, సిబ్బంది సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా కీర్తి చున్నితో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందన్నారు. వెంటనే కిందకు దించి అక్కడే ఉన్న డాక్టర్లు పరిశీలించగా మృతి చెందిందని సూపరెండెంట్ కమలమ్మ తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనారోగ్యం కారణంగానే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని కళాశాల యాజమాన్యం భావిస్తున్నారు.