చనిపోయినా వెంటాడుతున్న కష్టాలు- ఏళ్ల తరబడి గ్రామస్థుల అవస్థలు - No Road To Cremation Ground
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 21, 2024, 1:06 PM IST
No Road to Cremation Ground: మనిషి జీవించడానికిి ఇల్లు ఉన్నట్లే చనిపోయిన తరువాత ఖననం చేసేందుకు ఏ ఊరికైనా శ్మశానవాటిక తప్పనిసరి. ఏలూరు జిల్లాలోని ఓ గ్రామానికి శ్మశానవాటిక ఉంది కానీ అందుకు దారి మాత్రం లేదు. కుండపోతగా కురుస్తున్న వర్షంలో నదిని దాటి వెళ్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి తీవ్ర ఇబ్బందిపడిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. బుట్టాయగూడెం మండలం దొరమామిడి శివారు సరుగుడు పునరావాస కాలనీకి చెందిన కత్తుల చెల్లమ్మ అనే మహిళ అనారోగ్యంతో మృతిచెందారు.
ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు స్థానికులు నానా అవస్థలు పడ్డారు. జల్లేరు జలాశయం అవతలవైపున ఉన్న శ్మశానవాటిక వద్దకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అనేక ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఒక వైపు కుండపోత వర్షం, మరో వైపు పొంగి ప్రవహిస్తున్న పంట కాలువ, బురదమయమై జారిపోతున్న గట్లను దాటి వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. వర్షాకాలంలో ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట కాలవ దాడి వెళ్లేందుకు ఏదైనా ఏర్పాట్లు చేయాలని ఏళ్ల తరబడి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోలేదని తెలిపారు.