నన్నయ విశ్వవిద్యాలయానికి కొత్త ఇంఛార్జ్ వీసీ నియామకం- బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు - ANU New incharge VC - ANU NEW INCHARGE VC

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 19, 2024, 10:10 AM IST

Adikavi Nannaya University New incharge VC: నన్నయ విశ్వవిద్యాలయానికి కొత్త ఇంఛార్జ్ వీసీను నియమిస్తూ రాష్ట్ర ఉన్నత విద్య శాఖ గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. నన్నయ విశ్వవిద్యాలయానికి జియోసైన్సెస్‌ విభాగం ప్రొఫెసర్‌ ఆచార్య వై.శ్రీనివాసరావును ఇన్‌ఛార్జి వీసీగా నియమించింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన వీసీగా బాధ్యతలు స్వీకరించారు. 

తనపై ఉన్న నమ్మకంతో విశ్వవిద్యాలయ ఇంఛార్జ్​ వీసీగా నియమించినందుకు గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తదితర అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం త్రికరణ శుద్ధితో పనిచేస్తానని అన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం, కాకినాడ, తాడేపల్లిగూడెం ప్రాంగణాలతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాలోని విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల ప్రతినిధులు, అధ్యాపకుల సమిష్టి కృషితో యూనివర్సిటీని ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.