నెల్లూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ - కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు రాజీనామా, టీడీపీలో చేరిక - ycp leader joining to tdp party
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 19, 2024, 4:44 PM IST
Nellore YCP Leaders JOin In TDP Party : నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీలో క్రీయాశీలకంగా ఉన్న వైసీపీ ట్రేడ్ యూనియన్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు ముత్యంగౌడ్ తెలుగుదేశంలో చేరారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ముత్యంగౌడ్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆ పార్టీని వీడుతున్నానని తెలిపారు. కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలతో మనస్థాపానికి గురిఅయ్యానని వెల్లడించారు.
గత ప్రభుత్వంలో కల్లుగీత కార్మికులు చనిపోతే రూ. 5లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాన్ని రూ.10 లక్షలకు చేస్తారని జగన్ హామీ ఇచ్చారు. ఐదేళ్లు గడిచిన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలోనే 30 మంది కార్మికులు చనిపోయారు. ఏ ఒక్కరికి కూడా పరిహారం చెల్లించింది లేదు. ఈ సమస్యలన్నింటిపై ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన ఎటువంటి స్పందన లేదని తెలిపారు. కల్లుగీత కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నందున కార్మికులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముత్యం గౌడ్ వెల్లడించారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే టీడీపీలోకి చేరినవారికి పార్టీ అధికారంలోకి రాగానే వారి డిమాండ్లను ఖచ్చితంగా పరిశీలిస్తామని కోటంరెడ్డి హామీ ఇచ్చారు.