నెల్లూరులో నారా లోకేశ్ ఎన్నికల సమరభేరి - ప్రత్యక్ష ప్రసారం - Nara Lokesh election rally live - NARA LOKESH ELECTION RALLY LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 1, 2024, 6:17 PM IST
|Updated : May 1, 2024, 7:19 PM IST
Nara Lokesh Yuvagalam election rally live: నెల్లూరులో యువగళం, ఎన్నికల సమరభేరి కార్యక్రమంలో నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నాడు ఒక్క అవకాశం అని జగన్ మాయలో పడటంతో నేడు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని లోకేశ్ అన్నారు. టీడీపీ తెచ్చిన కంపెనీలు ఇప్పుడు పక్క రాష్ట్రానికి తరలిపోయాయని మండిపడ్డారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకున్నానని లోకేశ్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారాలను మేనిఫెస్టోలో పొందుపరిచామన్నారు. టీడీపీ హయాంలో జిల్లాల వారీగా ప్రాధాన్యం కల్పించి నిలిచిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కూటమి వచ్చిన వంద రోజుల్లో పెట్టుబడులకు పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. బ్యాండేజ్ బాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని జగన్ పై మండిపడ్డారు. జగన్ ముఖంపై జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం అయ్యిందని ఎద్దేవా చేశారు. కోడి కత్తి కమల్ హాసన్ అంటూ జగన్ ఫోటోలను తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతలో లోకేశ్ జత చేశారు.
Last Updated : May 1, 2024, 7:19 PM IST