మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో లోకేష్ దంపతుల ప్రత్యేక పూజలు - lokesh visit Sri Lakshmi Narasimha Swamy temple - LOKESH VISIT SRI LAKSHMI NARASIMHA SWAMY TEMPLE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 6, 2024, 10:30 PM IST
Nara Lokesh Visit Sri Lakshmi Narasimha Swamy Temple in Mangalagi : తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దంపతులు మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు లోకేశ్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంగళగిరి నియోజకవర్గంలో అఖండ విజయం సాధించిన లోకేశ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ కలిసేందుకు ప్రజలు భారీ ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ఆలయంలో నుంచి బయటికి వచ్చేందుకు లోకేశ్‌కు సుమారు 30 నిమిషాలకు సమయం పట్టింది.
అయితే మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యదర్శి, తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై 91వేల మోజార్టీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ దశాబ్దాలుగా గెలవని మంగళగిరి సీటులో గెలిచి తన సత్తా నిరుపించుకున్నారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ 2 సార్లు గెలిచింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరిలో పసుపు జెండా ఎగురువేసి లోకేశ్ చరిత్ర సృష్టించారు.