జగన్ హయాంలో ఇంట్లో పెంచుకునే కుక్కకు కూడా పన్ను: లోకేశ్
🎬 Watch Now: Feature Video
Nara Lokesh Sensational Allegations on CM Jagan: ఎన్నికల తర్వాత జగన్ పక్క రాష్ట్రానికి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన శంఖారావం సభలో సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకు వచ్చిన సుమారు వంద సంక్షేమ కార్యక్రమాలకు కోత పెట్టిన ఏకైక సీఎం జగన్ అని మండిపడ్డారు. గిరిజనులకు రావాల్సిన 16 సంక్షేమ కార్యక్రమాలను కట్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకొండలో కోట్ల రూపాయల విలువైన భూమిని బినామీల పేరిట స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దోచుకున్నారని ఆరోపించారు. ఏపీకి పట్టిన శని జగన్ అంటూ ఎద్దేవా చేశారు.
మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకైనా వేశాడా అని ప్రశ్నించారు. సీఎం జగన్ విశాఖలో రూ.500 కోట్లతో ప్యాలస్ కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే తెలgగుదేశం ప్రభుత్వంలో ఆ ప్యాలెస్‌ను ప్రజల అవసరాల కోసం ఉపయోగిస్తామని లోకేశ్ తెలిపారు. సీఎం జగన్ ఇంటి పన్ను, చెత్త పన్నులు పెంచారని, ఇంట్లో కుక్క ఉంటే దానికి కూడా పన్ను వేస్తాడని లోకేశ్ ఎద్దేవా చేశారు.