ఎవ్వరూ అదైర్యపడొద్దు - టీడీపీ అండగా ఉంటుంది: భువనేశ్వరి - నారా భువనేశ్వరి నిజం గెలవాలి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 3:14 PM IST
Nara Bhuvaneshwari Nijam Gelavali Program : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో తీవ్ర మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబాలకు నారా భువనేశ్వరి అండగా నిలుస్తున్నారు. గత కొన్ని రోజులుగా "నిజం గెలవాలి" కార్యక్రమంతో భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకుని ఓదార్చుతున్నారు. ఎవ్వరూ అదైర్యపడోద్దని, బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నారు.
Nijam Gelavali Program in Atmakur Nellore District : "నిజం గెలవాలి" కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అల్లీపురం గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, స్థానిక టీడీపీ నాయకులు ఆమెకు స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు అరెస్టును తట్టుకోలేక అదే గ్రామానికి చెందిన కార్యకర్త కముజుల ఆంజనేయ రెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. భువనేశ్వరి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. కుటుంబానికి 3 లక్షల రూపాయల చెక్కు ఇచ్చి ఆర్ధిక సాయం చేశారు. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని భువనేశ్వరి భరోసా ఇచ్చారు.