తెనాలి నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో - 10 అభివృద్ధి అంశాలను వెల్లడించిన నాదెండ్ల మనోహర్ - nadendla manohar manifesto - NADENDLA MANOHAR MANIFESTO
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 11, 2024, 5:32 PM IST
Nadendla Manohar Manifesto Release on Tenali Development : రాష్ట్రంలోనే ప్రత్యేక నియోజకవర్గంగా పేరుగాంచిన ఆంధ్ర పారిస్గా పిలవబడే తెనాలిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టనున్న పనులపై ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఓ మేనిఫెస్టోని విడుదల చేశారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గానికి సంబంధించిన మేనిఫెస్టోని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంలో ప్రజను నుంచి విశేషస్పందన వచ్చిందని తెలిపారు. స్థానిక ప్రజలు తనపై చూపించిన ప్రేమ ఎప్పటికి మరువలేనన్నారు.
కూటమి నేతలందరూ ఒకరికోకరు సమన్వయం చేసుకుంటూ ప్రచారం నిర్వహించారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ కూటమి విజయమే లక్ష్యంగా పనిచేశారని పేర్కొన్నారు. అమరావతి రాజధాని పరిధిలో ఉన్న తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి పది అంశాలతో కూడిన మేనిఫెస్టోను రూపొందించినట్లు మనోహర్ తెలిపారు. వాటిలో రోడ్లు, చెత్తపన్ను రద్దు, డిజిటల్ లైబ్రరీ, ఆసుపత్రులు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, రక్షిత మంచినీరు, సంగీత అకాడమి, గంజాయి విముక్త తెనాలి మెుదలైనవి ఉన్నాయి.