కౌంటింగ్ రోజున తెనాలిలో ఘర్షణలు జరిగే అవకాశం- నాదెండ్ల మనోహర్ - Nadendla guided to alliance leaders - NADENDLA GUIDED TO ALLIANCE LEADERS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 2, 2024, 7:55 PM IST
Nadendla Manohar Guided to Alliance Leaders During Counting : కౌంటింగ్ నేపథ్యంలో కొంతమంది అల్లరి మూకలు తెనాలిలో ఘర్షణ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోనే తెనాలి నియోజకవర్గం ఎంతో ప్రశాంతమైన ప్రాంతమని వివరించారు. ప్రజాస్వామ్యంలో అతి పెద్ద పండుగా అయిన ఎన్నికల్లో నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఓటరు పాల్గొన్నారని వెల్లడించారు. ప్రజా స్వామ్యాన్ని రక్షించటం కోసం ప్రతి ఓటరు ముందుకు వచ్చారన్నారు. రాష్ట్రంలో మార్పు కోసం ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి వచ్చారని గుర్తుచేశారు.
అయితే ఓట్ల లెక్కింపు వేళ తెనాలి నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాటిపై కూటమి నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు ప్రజా తీర్పును గౌరవిద్దామని వివరించారు. నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణానికి దూరంగా ఉండలని పిలుపునిచ్చారు. కౌంటింగ్ వేళ ఎవరైన గొడవలకు పాల్పడినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ఓటమి భయంతో వైసీపీ శ్రేణులను ఆ పార్టీ నేతలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కౌంటింగ్ పక్రియకు విఘాతం కలిగించి ఎలాగైన గెలవాలని వైసీపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఇలాంటి కుట్రలు జరగకుండా కూటమి నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని నాదెండ్ల మనోహర్ సూచించారు.