రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్ తరాల కోసమే పొత్తు: నాదెండ్ల మనోహర్ - Pawan kalyan Campaign in tenali - PAWAN KALYAN CAMPAIGN IN TENALI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 30, 2024, 6:03 PM IST
Nadendla Manohar about pawan Kalyan Tenali Campaign: రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్ తరాల కోసం పవన్ కల్యాణ్ పొత్తు నిర్ణయించారని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 231 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలకు లక్ష చొప్పున అందజేసి అండగా నిలిచిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని నాదెండ్ల స్పష్టం చేశారు. తెనాలి బహిరంగ సభలో భవిష్యత్తు కార్యాచరణ గురించి ప్రజలకు పవన్ కల్యాణ్ వివరిస్తారని తెలిపారు. ఏప్రిల్ 3న జరిగే బహిరంగ సభను టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు విజయవంతం చేయాలని మనోహర్ కోరారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 3న గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్కెట్ సెంటర్లో సభ నిర్వహిస్తున్నట్లు నాదెండ్ల తెలిపారు. మార్కెట్ సెంటర్లోని వ్యాపారస్థుల దగ్గరకు వెళ్లి పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా కొంత అసౌకర్యం కలుగుతుందని పర్యటన సందర్భంగా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని మనోహర్ అభ్యర్థించారు. సభ కారణంగా జరిగే అసౌకర్యానికి క్షమించాలని కోరారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ఈరోజు పిఠాపురం నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే.