"ఇదీ YSRCP దుస్థితి" - భోజనాలు ఉన్నాయి, బిర్యానీ పెడతాం వెళ్లొద్దూ అంటూ వేడుకోలు - MP Vijayasaireddy Election Campaign - MP VIJAYASAIREDDY ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 29, 2024, 10:19 AM IST
MP Vijayasai Reddy Election Campaign Lack Response from People: ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలకు చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. వారు నిర్వహించే సభలకు, ర్యాలీలకు బస్సుల్లో, ప్రైవేటు వాహనాల్లో భారీగా జనాలను బెదిరించి తరలించినా ముఖ్య నేతల ప్రసంగాలు ముగిసే వరకూ కూడా జనం ఉండడం లేదు. ఎక్కడ చూసినా అధికారపార్టీ నేతలకు ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి (YCP MP Vijayasai Reddy) ఘోర అవమానం ఎదురైంది. సీతారామపురంలో ప్రచార రథంపై ప్రసంగిస్తుండగా జనం ఒక్కసారిగా లేచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ పార్టీ కార్యకర్తలు సైతం ప్రసంగం సమయంలోనే ఇంటిబాట పట్టారు. దీన్ని గమనించిన వైసీపీ నేతలు 'వెళ్లొద్దు - ఆగండి ఆగండి' అని బ్రతిమలాడుకున్నారు. 'భోజనాలు ఉన్నాయి' అంటూ మైక్‌లో అనౌన్స్ చేస్తూ వారిని ఆపే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.