కుటుంబ కలహాలు - ఇద్దరు కుమారులతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం - MOTHERATTEMPT SUICIDE WITH CHILDREN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 15, 2024, 7:59 PM IST

Mother Attempted Suicide Along with Children: కుటుంబ కలహాలతో ఇద్దరు కుమారులతో కలిసి తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం మలగాం పంచాయతీ కుముందవానిపేట గ్రామంలో కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన డెక్కల దుర్గ అనే మహిళ తన ఇద్దరు కుమారులకు కూల్ డ్రింక్​లో ఎలుకల మందు కలిపి తాగించి తానూ ఆత్మహత్యకు యత్నించింది. ఉదయం 9 గంటలైనా ఇంటి తలుపులు తెరవకపోవడంతో అనుమానంతో బలవంతంగా తలుపులు గ్రామస్థు తెరిచారు. ఈ ఘటనలో తమ ఇద్దరు కుమారుల్లో 4వ తరగతి చదువుతున్న కుమారుడు రుషి(9), 3వ తరగతి చదువుతున్న బాలు (8) మృతి చెందారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన గ్రామస్థులు హుటాహుటిన టెక్కలి లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రికి చెందిన రాజు అనే వ్యక్తితో ఈమెకు 12ఏళ్ల క్రితం వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈమె అఘాయిత్యానికి పాల్పడినట్లు ఎస్‌ఐ నారాయణస్వామి తెలిపారు. దుర్గపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.