మంగళగిరి భూములపై వైసీపీ కన్ను - ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పంచుమర్తి అనురాధ - ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 16, 2024, 9:36 PM IST
MLC Panchumarti Anuradha: మంగళగిరిలోని దేవదాయ శాఖ భూములను ఆక్రమించేందుకు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. విశాఖలో ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన విజయసాయిరెడ్డి చూపు, ప్రస్తుతం మంగళగిరి భూములపై పడిందన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్ర కమల సహకారంతోనే భూముల ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారన్నారు. మంగళగిరి ప్రజలు వారి భూముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అనురాధ సూచించారు. ప్రజల ఆస్తులను లాక్కునేందుకు వీరు దేనికైనా వెనకాడరని విమర్శించారు.
మంగళగిరి నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఇసుకను తవ్వేస్తున్నారని ఆరోపించారు. ఇసుకను తవ్వి వచ్చిన ఆ అక్రమార్జనను తాడేపల్లి ప్యాలెస్‌కి పంపిస్తున్నారని అన్నారు. గతంలో పురపాలక సంఘం చైర్మన్‌గా గంజి చేసిన అవినీతిని ప్రజలు మరిచిపోయారని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు వాటాలేసుకుని విశాఖను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో గజదొంగ విజయసాయిరెడ్డి అని దుయ్యబట్టారు. కళ్లు మూసి తెరిచేలోపు భూములన్నీ దోచేస్తారని మండిపడ్డారు. ఇందులో ఎవరి వాటా ఎంతో చెప్పాలని ప్రశ్నించారు.