టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్సీ ఇక్బాల్ - MLC Mohammad Iqbal Joining TDP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 6, 2024, 7:38 PM IST

MLC Mohammad Iqbal Joining TDP: ఇటీవల ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన వైసీపీ నాయకుడు ఇక్బాల్ త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. తన పట్ల అమర్యాదగా ప్రవర్తించడం వల్లే మనస్తాపం చెంది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన చెప్పారు. అన్నివర్గాల వారికి న్యాయం జరగాలంటే రాజకీయ చతురుడు చంద్రబాబు నాయుడుతో మాత్రమే సాధ్యమని ఇక్బాల్ అభిప్రాయపడ్డారు. నంద్యాల టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్.ఎం.డీ. ఫరూక్​ను ఇక్బాల్ కలిశారు. 

కాగా ఇటీవల వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి హిందూపురం నేత మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు రాజీనామా లేఖను సైతం పంపారు. రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్‌కు కూడా ఆయన పంపించారు. మరోవైపు ఎన్నికల వేళ వైసీపీ నుంచి నేతలంతా ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ సైతం రాజీనామా చేశారు. ఈ నెల 9వ తేదీన ప్రజల సమక్షంలో భవిష్యత్‌ కార్యాచరణ, రాజకీయ ప్రణాళిక ప్రకటిస్తానని ఆమంచి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.