అవమానాలకు గురిచేశారు - అందుకే వైఎస్సార్సీపీకి రాజీనామా చేశా: ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి - MLC Janga Krishnamurthy - MLC JANGA KRISHNAMURTHY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 5:16 PM IST
MLC Janga Krishnamurthy resigned from YCP: ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. సోమవారం దాచేపల్లి మండలం గామాలపాడులో తన స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ బీసీలకు కేవలం పదవులు మాత్రమే ఇచ్చిందని, కానీ, అధికారాలు మాత్రం ఇవ్వలేదని విమర్శించారు. జంగాతోపాటు ఆయన అనుచరులు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
వైసీపీలో గత కొంతకాలంగా అనేకమైన ఇబ్బందులు, అవమానాలకు గురైనట్లు జంగా వెల్లడించారు. పదవిని ఆశించి పార్టీ మారడం లేదని కృష్ణమూర్తి స్పష్టం చేశారు. కార్యకర్తల అభిప్రాయాల మేరకు పార్టీ మారుతున్నట్లు తెలిపారు. తాను ఏ పార్టీలో ఉన్నా, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం పోరాడుతానని తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో ఇంతవరకూ సహాయం చేసిన బీసీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానంతో ఇన్ని సంవత్సరాలుగా పార్టీలో కొనసాగినట్లు తెలిపారు. గత పదిహేను సంవత్సరాలుగా జగన్ కోసం పోరాడినట్లు వెల్లడించారు. పల్నాడులో ఉన్న వైసీపీ నేతలు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసే పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. వైసీపీకి రాజీనామా చేసిన జంగా త్వరలో టీడీపీలో చేరనున్నారు.