గవర్నర్ విచారణకు ఆదేశించినా పట్టించుకోలేదు- విద్యాశాఖ అధికారులపై లోకేశ్‌కు భూమిరెడ్డి ఫిర్యాదు - MLC BHUMIREDDY COMPLAINT - MLC BHUMIREDDY COMPLAINT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-06-2024/640-480-21724113-thumbnail-16x9-mlc-bhumireddy-ramgopal-reddy-complaint-to-minister-nara-lokesh2.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 16, 2024, 3:54 PM IST
MLC Bhumireddy Ramgopal Reddy Complaint to Minister Nara Lokesh : వైెఎస్సార్ జిల్లా విద్యాశాఖ అధికారులపై మంత్రి నారా లోకేశ్‌కు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కడప జిల్లాలో విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి అవినీతి, అక్రమాలపై భూమిరెడ్డి లోకేశ్‌ను కలిశారు. ఇద్దరిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లోకేశ్‌కు వినతి పత్రం అందించారు. భూమిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ప్రకారం, "కడప జిల్లా రీజినల్ జాయింట్ డైరెక్టర్ గా మార్చి నుంచి రాఘవ రెడ్డి పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన అక్కడే డీఈఓగా చాలా కాలం పనిచేశారు. ఆ సమయంలో ఆయన వైఎస్సార్సీపీ నాయకుని కన్నా అధ్వానంగా పనిచేశారు. 2023 మార్చిలో జరిగిన ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు మద్దతుగా రాఘవ రెడ్డి పనిచేశారు. నేను ఎమ్మెల్సీ అయిన తరువాత ఇతనిపై ఫిర్యాదు చేస్తే, ప్రతిగా ప్రెస్ మీట్లు పెట్టి నా అంతు తేలుస్తానని బెదిరించాడు. కడప జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసినా స్పందించలేదు. నేను రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. గవర్నర్ విచారణకు ఆదేశించినా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదు. రాఘవ రెడ్డి అవినీతి అక్రమాలపై ఉపాధ్యాయ సంఘాలు అనేక సందర్భాలలో ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదు. ఇప్పటికైనా అతడిని సస్పెండ్ చేసి, అక్రమాలపై విచారణ జరిపించి, కఠినంగా శిక్షించాలి" అని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు.