టీడీపీ జెండా ఎగరేయడం కోసం కలిసి పని చేద్దాం: వసంత కృష్ణప్రసాద్​ - mla Vasantha Krishna Prasad Meeting

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 19, 2024, 10:04 PM IST

MLA Vasantha Krishna Prasad Meeting : ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సమావేశమయ్యారు. తాను కండిషనల్​గా పార్టీలో చేరలేదని, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పని చేయడానికి సిద్దంగా ఉన్నానని టీడీపీ నాయకులను ఉద్దేశించి ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కొంతమంది ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదని పార్టీలు మారారు, కానీ జగన్మోహన్ రెడ్డి సీటు ఇస్తానని చెప్పినా తిరస్కరించి బయటికి వచ్చిన ఏకైక శాసన సభ్యుడిని తానే అన్నారు. 

రాజకీయ కారణాలతో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తనకు మధ్య ఆరోపణలు శ్రుతిమించిన మాట వాస్తవమన్నారు. కానీ ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తనీ తాను దూషించలేదని తెలిపారు. అదే విధంగా సామాజిక మాధ్యమాలలో తనపై ఎంతమంది ఎన్ని విధాలుగా కామెంట్స్ చేసినా తాను పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుందన్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. మైలవరంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం కోసం మనమంతా కలిసి పని చేద్దామని కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.