అక్రమ వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటాం: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ - Daggupati Prasad on YSRCP Office - DAGGUPATI PRASAD ON YSRCP OFFICE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 26, 2024, 6:38 PM IST
MLA Daggupati Prasad on YSRCP Office: అనంతపురంలో అక్రమంగా నిర్మించిన వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని టీడీపీ నాయకులకు కలిసి ఆయన పరిశీలించారు. హెచ్ఎల్సీ స్థలాన్ని కబ్జాచేసి అనుమతులు లేకుండా కార్యాలయం నిర్మించారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 900 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాల్ని కబ్జా చేసి పార్టీ కార్యాలయాలు నిర్మించుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.
"వైఎస్సార్సీపీ నేతలు హెచ్ఎల్సీ స్థలాన్ని కబ్జా చేసి ఇక్కడ చెట్లు కూల్చి వేసి ప్రజల సొమ్ముతో అక్రమంగా పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారు. దీనికి నగరపాలక, అహుడా(అనంతపురం-హిందూపూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) అనుమతులు కూడా తీసుకోలేదు. గత రెండేళ్ల నుంచి ఈ భవనాన్ని నిర్మిస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు మేల్కొని అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిలో భాగంగానే మేం ఇప్పుడు వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని పరిశీలించాం. అక్రమంగా నిర్మించిన ఈ భవనాన్ని త్వరలోనే స్వాధీనం చేసుకుంటాం." - దగ్గుపాటి ప్రసాద్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే