హెడ్మాస్టర్​ దురుసు ప్రవర్తన - బదిలీ చేయాలని డీఈఓకి ఎమ్మెల్యే ఆదేశం - Prattipadu MLA Boorla Ramanjaneyu

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 2, 2024, 11:23 AM IST

thumbnail
హెడ్మాస్టర్​ దురుసు ప్రవర్తన - బదిలీ చేయాలని డీఈఓకి ఎమ్మెల్యే ఆదేశం (ETV Bharat)

Prattipadu MLA Boorla Ramanjaneyu Sudden Visit Kakumanu School : గుంటూరు జిల్లా కాకుమాను మండలపరిషత్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల పట్ల దురుసుగా వ్యవహరించడంపై మండిపడ్డారు. కాకుమాను గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేను ఎస్టీ కాలనీ వాసులు కలిసి సమస్యలు విన్నవించుకున్నారు. మండల పరిషత్‌ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు చలపతిరావు తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.

తమ పట్ల చిన్నచూపు చూస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలకు విద్యాబోధన కూడా సక్రమంగా చేయడం లేదన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ఐదుగురు విద్యార్థులే పాఠశాలలో ఉన్నారు. 30 మంది విద్యార్థులు ఉండాల్సిన చోట తక్కువ మంది ఉండటంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించడమేంటని ప్రధానోపాధ్యాయుడిని ఎమ్మెల్యే ప్రశ్నించారు. వెంటనే ఆయన్ని అక్కడి నుంచి బదిలీ చేయాలని డీఈఓకి(DEO) ఫోన్‌లో ఆదేశాలిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.