త్వరలో తిరుమల స్థానికులకు శుభవార్త - శ్రీవారి దర్శనానికి అనుమతిపై నిర్ణయం - MLA Arani Meet Tirumala Locals - MLA ARANI MEET TIRUMALA LOCALS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-06-2024/640-480-21817836-thumbnail-16x9-mla-meet-tirumala-locals.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 28, 2024, 4:33 PM IST
MLA Arani Srinivas Meeting with Locals of Tirumala : టీటీడీ పాలక మండలి ఏర్పాటు అయ్యాక స్థానికులకు ప్రతి మంగళవారం శ్రీవారి దర్శనం ఉంటుందని త్వరలో నిర్ణయం వెల్లడిస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్లానని ఎమ్మెల్యే ఆరణి తెలిపారు. ఎన్నికల తర్వాత మొదటి సారి ఆయన తిరుమల స్థానికులతో సమావేశమయ్యారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాలాజీ నగర్ వాసుల సమస్యలను 90 రోజుల్లో పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని, తితిదే అధికారులు కూడా వెంటనే స్థానికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. శ్రీవాణి, ఇతర దర్శనాలల్లో జరిగిన అవినీతిపై చట్టం తనపని తాను చేసుకుంటుంటూ వెళ్తుందని అన్నారు. తిరుమలలో జరిగిన అవకతవకల్లో ప్రత్యేకంగా విచారిస్తామని అవినీతి చేసిన వ్యక్తులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు.