గోదావరిలో యువకుడు గల్లంతు - డొక్కా సీతమ్మ ఆక్విడక్ట్ వద్ద మృతదేహం లభ్యం - Dead Body Found in Dokka Seethamma - DEAD BODY FOUND IN DOKKA SEETHAMMA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 30, 2024, 11:44 AM IST
Missing Man in Godavari Floods Dead Body Found at Dokka Seethamma Aqueduct : రెండు రోజుల క్రితం గోదావరి వరదల్లో గల్లంతైన యువకుడి మృతదేహం కోనసీమ జిల్లా పి. గన్నవరం డొక్కా సీతమ్మ ఆక్విడక్ట్ వద్ద లభ్యమైంది. మృతుడు గన్నవరం మండలం ఊడిమూడి లంకకు చెందిన చదలవాడ విజయకృష్ణగా గుర్తించారు. ఆక్విడక్ట్ వద్ద చెత్తలో చిక్కుకున్న మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికి తీసాయి. వరదల్లో గల్లంతైన విజయకృష్ణ మృతదేహం 6 కిలోమీటర్ల దూరంలో కనిపించింది. కుమారుడు బతికి వస్తాడని ఆశించిన తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
బూరుగుపూడి లంక నుంచి జి. పెదపూడి లంక, ఊడుమూడి లంక వాసులకు తాగు నీరు తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో పడవలో ఆరుగురు ఉన్నారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానిక ప్రజలు ఐదుగురిని సురక్షితంగా బయటకు తీసుకురాగా ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి కోసం ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది గాలింపు చేపట్టారు. ఈ రోజు మృతదేహం లభ్యమైంది.