నిద్ర లేచే సరికి రైతుకు షాక్​ - పొలంలో పంట మాయం - 2లక్షల విలువైన మిర్చి పంట చోరి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2024, 7:02 PM IST

3Lakh Valuable Mirchi Crop Theft In Rompicharla: దేశానికి వెన్నెముక అయిన రైతు నిత్యం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటకు సరిపడా నీరు లేకపోవటం, తుపానుకు నీట మునిగి పంట నష్టం రావడం, అన్నీ బాగుంటే గిట్టుబాటు ధర లభించకపోవటం వంటి ఎదో సమస్య రైతును వెంటాడుతోంది. ఆరుగాలం కష్టపడి పంట చేతికి వచ్చిందని ఆనందపడిన ఓ రైతు సంతోషం ఆవిరైపోయింది. కోత కోసిన పంట కుప్పగా పోసి ఆరబెడితే రాత్రికిరాత్రే గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడి ఆ రైతుకు కన్నీరు మిగిల్చారు.

పల్నాడు జిల్లా రొంపిచర్ల గ్రామానికి చెందిన రైతు గొట్టం శివారెడ్డి ఐదు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని మిర్చి పంట సాగు చేశాడు. గురువారం రాత్రి కోత కోసిన మిర్చిని కుప్పగా పోసి పొలంలో ఆరబోశాడు. రాత్రి సమయంలో తాను పొలంలోనే ఉన్నట్టు శివారెడ్డి తెలిపారు. తెల్లవారుజామున చూస్తే సుమారు 15 క్వింటాళ్ల మిర్చి లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపాడు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారని రైతు స్పష్టం చేశారు. చోరీకి గురైన పంట 15 క్వింటాళ్లు ఉంటుందని రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. సుమారు మూడు లక్షల విలువైన పంట దొంగతనానికి గురి కావటంతో శివారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.