'వారి సేవలు వేరే రూపంలో వినియోగించుకుంటాం' - చంద్రబాబును కలిసిన మంత్రులు, సీనియర్ నేతలు - Ministers Meet in chandrababu - MINISTERS MEET IN CHANDRABABU
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 14, 2024, 9:51 PM IST
Ministers And TDP Senior Leaders Meet in CM chandrababu: మంత్రులుగా శాఖలు పొందిన కొంతమంది ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మరి కొంతమంది తెలుగుదేశం సీనియర్ నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. మంత్రి వర్గం కూర్పు చేసిన విధానాన్ని చంద్రబాబు వారికి వివరించారు. మంత్రి వర్గంలో చోటు దక్కని వారి సేవలు వేరే రూపంలో వినియోగించుకుంటామని సీఎం స్పష్టం చేశారు. తమకు కేటాయించిన శాఖలపై మంత్రులు అనిత, నిమ్మల రామానాయుడు, సత్య కుమార్ సీఎంను కలిసి సంతోషం వ్యక్తం చేశారు. తనకు హోం శాఖ కేటాయించినందుకు అనిత ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
మంత్రులు సమర్ధవంతంగా పని చేయాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సూచించారు. సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, అయ్యన్న, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు తదితరులు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు. జగన్ రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు కాబట్టే ప్రజలు మార్పు కోరుకున్నారని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. క్యాబినేట్ వంద శాతం అద్భుతంగా ఉందని యనమల పేర్కొన్నారు. చంద్రబాబు సచివాలయానికి చేరుకున్న అనంతరం జలవనరులు సహా కొన్ని శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు.