ఛార్జీలు పెంచకుండానే బస్సు సర్వీసులు పెంచుతాం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి - Minister Ramprasad Reddy on RTC
🎬 Watch Now: Feature Video
Minister Ramprasad Reddy on Irregularities in RTC During YCP Govt : వైఎస్సార్సీపీ హయాంలో రవాణా శాఖ నిర్వీర్యమైందని ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించలేదని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఆర్టీసీ భూముల లీజుల పేరుతో వైఎస్సార్సీపీ నేతలు ఆక్రమణలకు యత్నించారని వాటన్నింటినీ వెనక్కి తీసుకుంటామని అన్నారు. ఆడుదాం ఆంధ్రలోని అక్రమాలు వెలికి తీసి ప్రజల సొమ్ము తిన్న ఏ ఒక్కర్నీ వదిలిపెట్టమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు, ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు, భద్రత కల్పిస్తామని తెలిపారు. ఛార్జీల భారం పెంచకుండానే బస్సు సర్వీసులు పెంచి సేవలు అందిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో ఆర్టీసీని పట్టించుకోకుండా నిర్వీర్యం చేశారని ఎలాంటి భద్రత తీసుకోలేదని మండిపడ్డారు. ఇక మీదట ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ పని చేస్తుందని రాంప్రసాద్ రెడ్డి అన్నారు.